: అద్వానీని బయటపడేశా...అరుణ్ జైట్లీని ప్రాసిక్యూట్ చేస్తా: జెఠ్మలానీ
బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ హవాలా కుంభకోణం నుంచి బయటపడడానికి కారణం తానేనని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'జైట్లీని ఇష్టపడను' అన్న విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు తాను ప్రయత్నించనని అన్నారు. డీడీసీఏ కేసులో అవినీతికి పాల్పడ్డారన్న కేసులో కేజ్రీవాల్ పై వేసిన పరువు నష్టం కేసులో అరుణ్ జైట్లీని తాను ప్రాసిక్యూట్ చేస్తానని ఆయన చెప్పారు. బీజేపీ నుంచి తాను బహిష్కరణకు గురయ్యేందుకు కారణం అరుణ్ జైట్లీ, ఆయన కోటరీ అన్న విషయాన్ని మర్చిపోలేదని ఆయన చెప్పారు. డీడీసీఏ కేసులో విచారణ కమిటీ వేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉందని ఆయన స్పష్టం చేశారు.