: యాగానికి హాజరైన రామోజీరావు... ఎదురెళ్లి ఆహ్వానించిన కేసీఆర్
లోక కల్యాణం, ప్రజల సుఖశాంతుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. గవర్నర్ నరసింహన్ దగ్గరుండి మరీ యాగంలో పాలు పంచుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా యాగానికి వచ్చారు. ఈ క్రమంలో రామోజీ సంస్థల అధినేత రామోజీరావు కూడా హాజరయ్యారు. ఆయన వెంట 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ కూడా విచ్చేశారు. ఈ క్రమంలో, వీరికి ఎదురు వెళ్లి, సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. దారి చూపుతూ కేసీఆర్ ముందు నడవగా రామోజీరావు ఆయనను అనుసరించారు.