: నా వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే'పై పడింది... కలెక్షన్లు తగ్గాయి: షారుఖ్
మత అసహనంపై తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం తన తాజా చిత్రం 'దిల్ వాలే'పై పడిందని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్నాడు. దీనిపట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు. అయితే, అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని... వివరణ మాత్రం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపాడు. తన కళ్లతో ఏదైతే చూశానో అదే చెప్పానని... అయితే, తన మాటలను సరిగా అర్థం చేసుకోలేకపోయారని అన్నాడు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు. గత 25 ఏళ్లుగా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా తనను అభిమానిస్తున్నారని... తన సినిమాల ద్వారానే వారందరికీ తన ప్రేమను తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. తన దేశ భక్తిని శంకించాల్సిన అవసరం లేదని తెలిపారు.