: అసెంబ్లీని టీడీపీ కార్యాలయంలా మార్చేశారు: స్పీకర్ పై నల్లపురెడ్డి విమర్శలు
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మార్చేశారని మండిపడ్డారు. కాల్ మనీ, ఇతర కుంభకోణాలపై సభలో చర్చ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దారుణమని చెప్పారు. అధికారపక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.