: ముదిరిన జైట్లీ, కేజ్రీ వివాదం... డీడీసీఏపై విచారణకు కమిటీని వేసిన ఢిల్లీ సర్కారు
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకే సిద్ధపడింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ప్రమేయముందని భావిస్తున్న ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అవకతవకలపై విచారణ చేసేందుకు కేజ్రీ సర్కారు ఏక సభ్య కమిషన్ ను నియమించింది. మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేస్తూ నేటి ఉదయం కేజ్రీ కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీడీసీఏ వ్యవహారంపై విచారణకు గత వారమే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకే కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్టైంది.