: ఎంతో హింసను అనుభవిస్తున్న 'లైఫ్ ఆఫ్ పై' పులి


ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకున్న చిత్రం 'లైఫ్ ఆఫ్ పై'. బతకాలనే ఆశతో పాటు సర్వం కోల్పోయినా... జీవితం నిర్దేశిత గమ్యానికే చేరుతుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అద్భుతమైన విజువల్స్ ఈ సినిమా విజయానికి మరింత దోహదం చేశాయి. ఈ సినిమాలో రిచర్డ్ పార్కర్ గా ఓ పులి నటించి అందరినీ మెప్పించింది. అంతటి సెలబ్రిటీ పులి ఇప్పుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తోందంటే నమ్మడం కష్టం. కానీ ఇది ముమ్మాటికీ నిజం. కెనడాలోని ఒంటారియోలో గల ఓ జూలో ఆ పులి ఉంటోంది. దాని సంరక్షకుడే ఆ పులిని హింసకు గురి చేస్తున్నాడు. మిచెల్ హాకెన్ బర్గర్ అనే పెద్ద మనిషి సొంతంగా ఓ జూపార్క్ ను నడుపుతున్నాడు. జంతువులకు ట్రైనింగ్ ఇవ్వడంలో దిట్ట అని అతనికి పేరుప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. లైఫ్ ఆఫ్ పై లో నటించిన యునో (పులి అసలు పేరు)కు కూడా ఆయనే శిక్షణ ఇచ్చాడు. మొదటి నుంచి కూడా యూనోను మిచెల్ హింసిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో, ప్రఖ్యాత జంతు సంరక్షణ సంస్థ 'పెటా' రహస్యంగా ఓ వీడియోను చిత్రీకరించింది. పులిని పదేపదే కొరడాతో కొడుతూ, పచ్చి బూతులు తిడుతుండటం వీడియోలో రికార్డ్ అయింది. ఇంకో విషయం ఏమిటంటే... "పులి నోటిపై, కాళ్లపై కొడితే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది" అని మిచెల్ అంటున్న మాటలు వీడియోలో క్లియర్ గా వినిపించాయి. ఈ క్రమంలో, మిచెల్ పై కేసు పెట్టడానికి పెటా సిద్ధమవుతోంది. లైఫ్ ఆఫ్ పై చిత్రంలో తమను ఎంతో అలరించిన పులి కష్టాలను అనుభవిస్తోందని తెలుసుకున్న అభిమానులు ఆవేదనకు లోనవుతున్నారు.

  • Loading...

More Telugu News