: చండీయాగం ప్రారంభం... శ్రీకారం చుట్టిన కేసీఆర్ దంపతులు
విశ్వశాంతి, తెలంగాణ సస్యశ్యామలాన్ని కాంక్షిస్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సకుటుంబ సమేతంగా యాగక్షేత్రానికి చేరుకున్న కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులతో కలిసి యాగానికి శ్రీకారం చుట్టారు. తొలుత యాగక్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసిన కేసీఆర్, ఆ తర్వాత రుత్విక్కులు గురు ప్రార్థన పఠిస్తుండగా యాగాన్ని ప్రారంభించారు. కృత్తికా నక్షత్రంలో ప్రారంభమైన ఈ యాగం ఐదు రోజుల తర్వాత పుష్యమి నక్షత్రంలో ముగియనుంది.