: క్లర్కు బెడ్ కింద రూ.7 లక్షలు... ఐదు ఐఫోన్లు, ఖరీదైన వాచీలు కూడా!


నాగేంద్ర గంగ్వాల్... మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిరుద్యోగి (క్లర్కు)గా విధులు నిర్వహిస్తున్నాడు. కలెక్టరేట్ లో ఉద్యోగంతో చేతివాటం ప్రదర్శించిన అతడు భారీగానే అక్రమాస్తులు కూడబెట్టాడు. అతడి అవినీతి అక్రమాలపై ఉప్పందుకున్న మధ్యప్రదేశ్ ఏసీబీ అధికారులు నిన్న అతడి ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ లభ్యమైన నగదు, విలువైన వస్తువులను చూసిన ఏసీబీ అధికారులు షాక్ కు గురయ్యారు. నాగేంద్ర గంగ్వాల్ తన బెడ్ కింద ఏకంగా రూ.7 లక్షల విలువ చేసే కరెన్సీ కట్టలను దాచేశాడు. అంతేకాదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 20 ఖరీదైన వాచీలు, ఐదు ఐ ఫోన్లు కూడా అతడి ఇంటిలో దొరికిపోయాయి. రూ.10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.55 లక్షల విలువ చేసే భూమికి సంబంధించిన పత్రాలు, ఓ బ్యాంకు లాకర్ కు చెందిన వివరాలు సోదాల్లో బయటపడ్డాయి.

  • Loading...

More Telugu News