: కేసీఆర్ అయుత చండీయాగం నేటి నుంచే!... 8.10 గంటలకు శ్రీకారం


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో నేటి ఉదయం 8.10 గంటలకు ప్రారంభం కానున్న ఈ యాగం ఈ నెల 27 దాకా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. యాగం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే క్రతువులో కేసీఆర్ తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు హాజరుకానున్నారు. దాదాపు 1,500 మంది రుత్విక్కులతో జరగనున్న ఈ యాగానికి 3,300 మంది పోలీసులతో తెలంగాణ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది. ఇక యాగ క్షేత్రానికి 5 కిలో మీటర్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ 50వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.

  • Loading...

More Telugu News