: స్పీకర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం... నేటి ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సెక్రటరీకి అందజేత


ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ తాననుకున్నట్లుగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకే నిర్ణయించుకుంది. నిన్నటి వైసీఎల్పీ సమావేశంలో భాగంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానానికే మొగ్గుచూపారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై భగ్గుమన్న జగన్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో మొన్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో నిన్న ప్రత్యేకంగా భేటీ అయిన వైసీఎల్పీ... స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికే మొగ్గుచూపింది. నేటి ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సెక్రటేరియట్ లో అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న వైసీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News