: అతి పెద్ద టెలికాం విలీనానికి రంగం సిద్ధం
భారత దేశ టెలికాం రంగంలో అతిపెద్ద కార్పొరేట్ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ కు సంబంధించిన ఆర్ కాంలో ఎయిర్ సెల్ విలీనం కానుంది. ఈ మేరకు రెండు సంస్థలు చర్చలు జరుపుతున్నట్టు రిలయన్స్ సంస్థ వెల్లడించింది. దీంతో దీనిని దేశంలో అతిపెద్ద టెలికాం విలీనంగా వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్ సెల్ ను విలీనం చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా రిలయన్స్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. 4జీ సేవల్లో తనదైన ముద్ర వేయడం ద్వారా, భారత్ లో నెంబర్ వన్ టెలికాం సంస్థగా నిలవాలని రిలయన్స్ భావిస్తోంది. కాగా, రిలయన్స్ ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉంది. 4 జీ సేవలను విస్తరించడం ద్వారా నెంబర్ వన్ గా దూసుకెళ్లాలని రిలయన్స్ భావిస్తోంది.