: రాజమండ్రి పేరు మారిపోతోంది... న్యూ ఇయర్ నుంచి రాజమహేంద్రవరం!
తూర్పు గోదావరి జిల్లాలో వ్యాపార కేంద్రంగా వర్ధిల్లుతున్న రాజమండ్రి నగరం ఇకపై తన పేరును మార్చుకుంటోంది. ఈ ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ నగరం పేరును రాజమహేంద్రవరంగా మార్చనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి విదితమే. అందుకు అనుగుణంగా, వచ్చే జనవరి 1 నుంచి రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేర్కొనాలని సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.