: టీమిండియాలో 7వ స్థానం భర్తీ చేస్తా: హార్దిక్ పాండ్యా
టీమిండియాలో 7వ నెంబర్ ను భర్తీ చేస్తానని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆస్ట్రేలియాతో టీట్వంటీ సిరీస్ కు ఎంపికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయనని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పిచ్ లు తన ఆటతీరుకు అతికినట్టు సరిపోతాయని అభిప్రాయపడ్డాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. సరైన ఆల్ రౌండర్ లేని లోటును తీరుస్తానని హార్దిక్ పాండ్యా హామీ ఇస్తున్నాడు. గుడ్ లెంగ్త్ బంతులతో ఆసీస్ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెడతానని తెలిపాడు. కాగా, రంజీల్లో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, టీమిండియాలో ఆల్ రౌండర్లు ఒక్కసారిగా ఎక్కువైపోయారు. ప్రస్తుతం టీమిండియాలో యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, గురుకీరత్ సింగ్, హార్దిక్ పాండ్యాలు ఆల్ రౌండర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు.