: ఆమె విజయం అందాల పోటీలోనే కాదు...జీవనపోరాటంలో కూడా!


అతివాదులు భారీ సంఖ్యలో ఉన్న ఇరాక్ లో అందాల పోటీలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిది. అయినా తెగించి కష్టనష్టాలకు ఓర్చి అందాల పోటీలు నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ కిర్కుక్ లో ఎకనామిక్స్ చదువుతున్న షైమా ఖాసిం (20) 'మిస్ ఇరాక్' అందాల కిరీటం గెలుచుకుంది. అందాల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించగానే 200 మంది అమ్మాయిలు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని, అయితే ఈ పోటీల గురించి ఏర్పాటు చేసిన వెబ్ సైట్ లో ఇందులో పాల్గొనే యువతులను అంతం చేస్తామంటూ హెచ్చరికలు భారీ ఎత్తున వచ్చాయని, దీంతో వారి సంఖ్య క్రమంగా తగ్గడం ప్రారంభమైందని, ఇలా కేవలం పది మంది యువతులు మాత్రమే అంతిమంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని, వారిలో షైమా ఖాసిం విజయం సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఆమె కేవలం పోటీల్లో విజయం సాధించలేదని, జీవన పోరాటంలో విజయం సాధించారని వారు అభిప్రాయపడ్డారు. పలువురు నెటిజన్లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.

  • Loading...

More Telugu News