: పందెం కాసిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ పై నిషేధం
ఈ ఏడాది మార్చిలో జరిగిన పురుషుల వరల్డ్ కప్ ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' విజేత విషయంపై 9 డాలర్లు పందెం కాసిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏంజెలా రీక్స్ గత మార్చ్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్ టీవీలో వీక్షిస్తూ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' విషయంలో పందెం కాసింది. ఈ విషయం నెమ్మదిగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారుల చెవిని తాకింది. దీంతో ఆమెను వివరణ కోరిన అధికారులు, ఆరోపణలు వాస్తవమని తేలడంతో ఆమెపై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అవినీతి నిరోధంపై సహ క్రీడాకారిణులకు వివరించాలని అధికారులు ఆమెను ఆదేశించారు.