: శ్రీమేధ విద్యాసంస్థల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
సీఏ కోర్సులో అద్భుతాలు సాధిస్తామని ప్రకటనలు గుప్పించే శ్రీమేధ విద్యా సంస్థ హైదరాబాదులోని నాలుగు కోచింగ్ సెంటర్లు మూసేసింది. దీంతో అమీర్ పేటలోని శ్రీమేధ కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. హైదరాబాదులోని ఆరు బ్రాంచీలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఆందోళన చేపట్టారు. ఆరు సంవత్సరాల సీఏకు సమగ్ర శిక్షణ ఇస్తామని, విద్యార్థులను సీఏలుగా తీర్చిదిద్దుతామని శ్రీమేధ విద్యాసంస్థ లక్షలకు లక్షలు ఫీజులు గుంజిందని, ఫలితాలు సరిగా రావడం లేదని ఆరోపిస్తూ బ్రాంచీలు మూసేసిందని, తాము చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అయితే తాము ఆ డబ్బులు చెల్లించేది లేదని శ్రీమేధ యాజమాన్యం వారికి స్పష్టం చేయడం విశేషం.