: అంతరించిపోతున్న జంతువుల జాబితాలో భారతీయ సింహం
అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి భారత్, ఆఫ్రికాల్లోని ప్రత్యేక జాతికి చెందిన సింహాన్ని అమెరికా చేర్చింది. ద యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్ సంస్థ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. భారత్, పశ్చిమ, మధ్య ఆఫ్రికాల్లో ఉన్న లియోపాంథెరా లియో జాతికి చెందిన సింహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని తెలిపింది. ఈ సింహాలను ప్రపంచం అంతా ఎంతో ఇష్టపడుతుందని ఆ సంస్థ డైరెక్టర్ డాన్ ఆషె అన్నారు. ఇవి మాయమైతే ప్రపంచ వారసత్వ సంపదలో వీటి స్థానాన్ని ఇంకేవీ భర్తీ చేయలేవని ఆయన స్పష్టం చేశారు.