: మనీ ల్యాండరింగ్ కేసులో ఛగన్ భుజభల్ ఆస్తుల జప్తు
మనీ ల్యాండరింగ్ కేసులో మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఛగన్ భుజభల్ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఛగన్ భుజభల్ పబ్లిక్ వర్క్స్ అండ్ స్పెషల్ అసిస్టెన్స్ శాఖా మంత్రిగా పని చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఆయనకు సంబంధించిన 26 కోట్ల రూపాయలను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.