: నిద్ర మత్తే కొంప ముంచింది: కోల్ కతా విమానాశ్రయాధికారులు


డ్రైవర్ నిద్ర మత్తు కోట్ల రూపాయల నష్టం కలిగించిందని కోల్ కతా విమానాశ్రయాధికారులు తెలిపారు. నేటి ఉదయం ఎయిరిండియా విమానాన్ని బస్సు ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వైద్యపరీక్షల అనంతరం జరిపిన విచారణలో నైట్ డ్యూటీలో ఉండడంతో నిద్రను ఆపుకోలేకపోయానని, కునికిపాట్లు పడుతూ నిద్రమత్తులో బస్సును ఢీ కొట్టానని డ్రైవర్ మెమిన్ అలీ విచారణలో చెప్పాడని విమానాశ్రయాధికారులు వెల్లడించారు. కాగా, సోమవారం రాత్రి డ్యూటీలో ఉన్న మొమిన్ అలీ మంగళవారం తెల్లవారుజామున కునికిపాట్లు పడుతూ విమానాన్ని ఢీ కొట్టాడు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు విమానయాన శాఖ ఆదేశించింది. ఈ ఘటన కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సిన రెండు విమానాలను అధికారులు రద్దు చేశారు. కాగా, మొమిన్ అలీ ఢీ కొట్టిన విమానం విలువ 400 కోట్ల రూపాయలని అధికారులు వెల్లడించారు. విమానంలో చాలా భాగం దెబ్బతిందని వారు వివరించారు.

  • Loading...

More Telugu News