: కొత్త జంతువులూ వచ్చాయ్... బీఫెలో, లైగర్, టైగన్, జోంకీ, లెపోన్, గీప్
ఇంతవరకు ఈ ప్రకృతిలో లేని జంతువులు ఇప్పుడు కొత్తగా ప్రవేశిస్తున్నాయి. నేడు ఏంతో అభివృద్ధి చెందిన జెనిటిక్స్ ఇంజనీరింగ్ అలాంటి సృష్టి ఆవిర్భావానికి శ్రీకారం చుడుతోంది. ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని జాతుల జంతువులను మరొక జాతితో సంపర్కం చేయడం ద్వారా ఈ కొత్త జంతువుల ఉనికికి శాస్త్రవేత్తలు అంకురార్పణ చేశారు. జెనిటికల్ ఇంజనీరింగ్, క్లోనింగ్, క్రాస్ బ్రీడింగ్ ద్వారా జన్మించిన జంతువులే లైగర్, టైగన్, జోంకీ, లెపోన్, గీప్, బీఫెలో. వీటి వివరాల్లోకి వెళ్తే... లైగర్: మగ సింహానికి, ఆడ పులికి సంపర్కం చేయడం ద్వారా లైగర్ ను పుట్టించారు. సింహం లాంటి భారీ కాయం, పులిని పోలిన చారలు దీని ప్రత్యేకం. పిల్లి జాతి జంతువుల్లో ఇదే పెద్దది. ఇది సింహం కంటే భారీగా ఉంటుంది. టైగన్: మగ పులి, ఆడ సింహం కలయికతో ఇది జన్మించింది. ఇది సింహంలా జూలు విదిలిస్తుంది. పులిని పోలి ఉంటుంది. ఇది 180 కేజీల బరువు తూగుతుంది. జోంకీ: గాడిదకి, జీబ్రాకి సంపర్కం చేయడం ద్వారా దీనిని పుట్టించారు. ఇది గాడిదలా ఉన్నప్పటికీ దీనికి జీబ్రా చారలు ఉంటాయి. లెపోన్: చిరుత పులికి, ఆడ సింహానికి జన్మించిన జంతువును లెపోన్ అంటారు. దీనిని తొలిసారి 1910లో భారత్ లో తొలిసారి గుర్తించారు. ఇది అచ్చం చిరుత పులిలా ఉంటుంది. కానీ సింహంలా జూలు ఉంటుంది. గీప్: చూసేందుకు మేకలా ఉన్నప్పటికీ దీనికి ఊలు ఉండడం ప్రత్యేకత. మేక, గొర్రెకు సంపర్కం చేయడం ద్వారా దీనిని పుట్టించారు. దీనికి గీప్ అని పేరు పెట్టారు. బీఫెలో: గేదె జన్యువులను ఆవు జన్యువులతో కలపడం ద్వారా దీనిని పుట్టించారు. ఇది అడవి దున్నను పోలి ఉంటుంది. అయితే రంగులో ఆవును పోలి ఉండడం విశేషం.