: రోజా వ్యాఖ్యలు జుగుప్సాకరం: బుచ్చయ్యచౌదరి
వైకాపా ఎమ్మెల్యే రోజాకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మహిళాలోకం తల దించుకునేలా, జుగుప్సాకరంగా రోజా వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. రోజాకు ఏడాది నిషేధం సరిపోదని, జీవితకాల నిషేధం విధించాలని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోరంట్ల పైవ్యాఖ్యలు చేశారు.