: జగన్ గారూ, మీ ఇంట్లో ఆడవారికి ఇలాగే జరిగితే... చూస్తూ ఊరుకుంటారా?: అనిత
తనపై రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత శాసనసభలో కన్నీరు కార్చారు. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను నోటికొచ్చిన విధంగా మాట్లాడటం ఆమెకు తగదని అన్నారు. సాటి మహిళల పట్ల గౌరవం లేని రోజా లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్న వైకాపా అధినేత జగన్ ఏ విధంగా ప్రజల్లోకి వెళతారని ప్రశ్నించారు. దళిత మహిళను అవమానించిన వ్యక్తిని సభ నుంచి బహిష్కరిస్తే, సభనే బహిష్కరిస్తారా? అంటూ జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఇదే ఘటన మీ ఇంట్లో ఉన్న ఆడవారికి జరిగితే చూస్తూ ఊరుకుంటారా? అని జగన్ ను నిలదీశారు. రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.