: శాసనసభలో కంటతడి పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత


టీడీపీ ఎమ్మెల్యే అనిత శాసనసభలో కంటతడి పెట్టారు. వైకాపా ఎమ్మెల్యే రోజా తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలతో చెప్పలేని విధంగా తనను రోజా దూషించారని చెప్పారు. రోజా వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థంకాక, తాను రెండు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని, శాసనసభ సమావేశాలకు కూడా హాజరు కాలేకపోయానని అన్నారు. ఒక మహిళ అయి ఉండి కూడా సాటి మహిళపై దారుణ వ్యాఖ్యలు చేయడం అమానుషమని అనిత కన్నీరు కార్చారు. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రోజా మాట్లాడటం దారుణమని అన్నారు. ఏడాది పాటు శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన రోజున తనపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, అనిత కంటతడి పెట్టారు. తనకు న్యాయం చేయాలని స్పీకర్ ను కోరారు.

  • Loading...

More Telugu News