: టీడీపీలో చేరనున్న వైకాపా ఎమ్మెల్యే?


తెలంగాణలో టీఆర్ఎస్ మాదిరి ఏపీలో కూడా టీడీపీ గేట్లు బార్లా తెరిచినట్టే కనిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొణతాల, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లా అరకు వైకాపా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు కొణతాలకు ముఖ్య అనుచరుడని... కొణతాలతో పాటు ఆయన కూడా టీడీపీలో చేరుతారని చెప్పారు. వాస్తవానికి టీడీపీలో చేరడానికి చాలా మంది వైకాపా నేతలు సిద్ధంగా ఉన్నారని... అయితే, సమాజంలో గౌరవం ఉన్న వారినే పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. అందరినీ చేర్చుకుని పార్టీ పేరును పాడు చేసుకోలేమని చెప్పారు.

  • Loading...

More Telugu News