: స్వర్ణ బార్ మల్లాది విష్ణుదే... అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ
విజయవాడలో కల్తీ మద్యానికి కేంద్రంగా నిలిచిన స్వర్ణ బార్ కు సంబంధించి నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. నగరంలోని కృష్ణలంక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణ బార్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మల్లాది విష్ణుకు చెందిన బార్ లో వెలుగుచూసిన కల్తీ మద్యం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పుల పరిహారం చెల్లించామని మంత్రి ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా మంత్రి ప్రకటించారు.