: హైదరాబాద్ బిర్యానీకి ఇంకా జి.ఐ.ఆర్ గుర్తింపు లేదు: నిర్మలా సీతారామన్


ఎంతోమందికి ఫేవరెట్ డిష్ గా ఉన్న హైదరాబాద్ బిర్యానీకి ఇప్పటివరకు జి.ఐ.ఆర్ (భౌగోళిక సూచీ నమోదు కేంద్రం) గుర్తింపు లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. గుర్తింపు కోరుతూ 2009 జులై 28న దరఖాస్తు నమోదయిందని చెప్పారు. అయితే 2010 సెప్టెంబర్ 5, 2013 ఏప్రిల్ 28 తేదీల్లో జరిగిన సంప్రదింపుల బృంద సమావేశాల్లో దరఖాస్తును ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించిందని తెలిపారు. కానీ ప్రభుత్వం కోరిన ఇతర పత్రాలను దరఖాస్తుదారుడు ఇంకా సమర్పించలేదని పేర్కొన్నారు. దానివల్ల హైదరాబాద్ బిర్యానీకి జిఐఆర్ గుర్తింపు రాలేదని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి సభలో అడిగిన ప్రశ్నకుగాను మంత్రి ఈ మేరకు జవాబు ఇచ్చారు.

  • Loading...

More Telugu News