: టీడీపీలో చేరుతున్నాం... తేదీ త్వరలోనే చెబుతాం: కొణతాల
మాజీ మంత్రి, వైకాపాకు దూరంగా ఉంటున్న నేత కొణతాల రామకృష్ణ, ఆయన అనుచరుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు సైకిలెక్కడం ఖరారయింది. ఈ ఉదయం వారిద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ, తాము టీడీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. తమ అనుచరులతో, కార్యకర్తలతో సమావేశమవుతామని చెప్పారు. టీడీపీలో తాము ఎప్పుడు చేరేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు, ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, కొణతాల చేరికకు చంద్రబాబు ఆమోదం తెలిపిన తర్వాత, మరెవరూ వ్యతిరేకించేది ఉండదని చెప్పారు.