: ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్న నీటి గుర్రం వాణి మృతి


హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో మృత్యువాత పడుతున్న జంతువుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా, ఈ తెల్లవారుజామున వాణి అనే నీటి గుర్రం మృతి చెందింది. ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్న వాణి తన ఎన్ క్లోజర్ లోనే చనిపోయింది. జూ అధికారులు వాణికి పోస్టు మార్టం నిర్వహించి, నమూనాలను ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతానికైతే వాణి మృతికి గల కారణాలు తెలియవని, పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ జూలోనే వినాయక్, పార్వతి అనే నీటి గుర్రాలకు వాణి జన్మించింది.

  • Loading...

More Telugu News