: 'పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2015'గా 'ఆవు'... ప్రకటించిన యాహూ
ఈ ఏటి 'పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2015'గా యాహూ సంస్థ ఆవును ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్ పై నిషేధం ప్రకటించింది మొదలు భారత్ లో దానిపై ఆన్ లైన్ చర్చలు, 'దాద్రి' సంఘటన, అసహనంపై చర్చ వంటివి తమ నిర్ణయానికి కారణమని యాహూ తెలిపింది. దేశవ్యాప్తంగా బీఫ్ పై నిషేధంతో మొదలైన చర్చ పలు రకాల ఘటనలకు దారి తీసింది. కొందరు నిషేధం పాటించాల్సిందే అంటే, మరికొందరు రెచ్చగొట్టే విధంగా బీఫ్ మాంసంతో ప్రత్యేక ఫెస్టివల్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో కూడా అనేకమంది ఈ అంశంపైనే వెతికారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.