: సైకిలెక్కనున్న కొణతాల, గండి బాబ్జీ!... చంద్రబాబుతో భేటీ


కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలోనూ కీలక నేతగా వ్యవహరించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ‘సైకిల్’ పార్టీ ఎక్కనున్నారు. వైసీపీ విధానాలు నచ్చని కారణంగా కొంతకాలం క్రితం జగన్ కు బహిరంగ లేఖ రాసిన కొణతాల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన ఆయన దాదాపు ఏడాది పాటు ఏ పార్టీలోనూ చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తొలుత బీజేపీలో చేరుతున్నారని వార్తలు వచ్చినా, ఆ దిశగా కొణతాల అడుగులు వేయలేదు. తాజాగా ఏపీలో అధికార పార్టీ టీడీపీలో కొణతాల చేరుతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు కూడా ఇటీవల సద్దుమణిగాయి. నేటి ఉదయం అందరికీ షాకిస్తూ కొణతాల టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. తన సొంత జిల్లాకు చెందిన మరో కీలక నేత గండి బాబ్జీతో కలిసి కొణతాల టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో కొణతాల చేరిక ఖరారైపోయింది. ఇక ముహూర్తం ప్రకటనే తరువాయిగా మారింది.

  • Loading...

More Telugu News