: ఫిబ్రవరి తర్వాత ‘బ్రెండన్’ మెరుపులు ఉండవ్!... రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ కెప్టెన్
ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఈ వార్త షాకిచ్చేదే. విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరైన న్యూజిలాండ్ మేటి క్రికెటర్, ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో తన సొంత నగరం క్రైస్ట్ చర్చ్ లో జరగనున్న టెస్టే తనకు చివరి మ్యాచ్ (కెరీర్ లో 101టెస్టు) అని అతడు కొద్దిసేపటి క్రితం ప్రకటించాడు. బ్రెండన్ సడెన్ గా తీసుకున్న ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున అతడి మెరుపు ఇన్నింగ్స్ ను మనం చూడలేం. టెస్టులో ఓ ట్రిపుల్ సెంచరీని నమోదు చేసిన అతడు, టెస్టుల్లో వంద సిక్స్ లు బాది ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన చేరాడు.