: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... అభిమానుల్లో కలవరం
టాలీవుడ్ యువ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకైంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్ బిజీబిజీగా సాగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బాబాయి నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్’ కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బాబాయి, అబ్బాయిల మధ్యే పోటీ నెలకొంది. ఈ క్రమంలో చిత్రం రిలీజ్ కు సంబంధించి తనకేమీ తెలియదని జూనియర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ వెనువెంటనే డిలీట్ కావడం, మళ్ళీ ప్రత్యక్షమవడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో అభిమానులు కలవరానికి గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన ఎన్టీఆర్, తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకైందని పేర్కొన్నాడు. తన ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా తన కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత తిరిగి అభిమానులతో మాట్లాడతానంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు కలవరానికి గురవుతున్నారు.