: విమానాన్ని ఢీకొట్టిన బస్సు... తృటిలో తప్పిన పెను ప్రమాదం


ఆకాశంలో విహరించే విమానాన్ని, భూ ఉపరితలంపై ప్రయాణించే బస్సు ఎలా ఢీకొంటుందనేగా మీ అనుమానం. ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదులెండి. ఈ ప్రమాదం జరిగింది విమానాశ్రయంలో. రన్ వేపై నిలిచి ఉన్న విమానాన్ని వేగంగా దూసుకొచ్చిన బస్సు ఢీకొట్టింది. అయినా విమానాశ్రయంలో బస్సులకేం పనేనా మీ డౌటు. లగేజీనో, లేక విమానం దిగిన ప్రయాణికులనో ఎక్కించుకుని వచ్చేందుకు బస్సులు రన్ వేపైకి వెళ్లడం మనకు తెలిసిందేగా. ఈ సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేటి ఉదయం కోల్ కతాలోని ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సుకు పెద్దగా నష్టమేమీ జరగకున్నా, విమానం రెక్క మాత్రం భారీగా దెబ్బతింది. ఇక బస్సు మరింత వేగంగా వచ్చి ఢీకొట్టి ఉంటే భారీ విస్ఫోటనమే జరిగేది. విమానాన్ని ఢీకొన్న బస్సు విమానం ఇంజిన్ కు కాస్తంత దూరంగానే నిలిచింది. అలా కాకుండా విమానం ఇంజిన్ ను బస్సు తాకి ఉంటే మాత్రం పెద్ద పేలుడే సంభవించి ఉండేది. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై విమానాశ్రయ అధికారులు విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News