: కరీంనగర్ లో కత్తి చేతబట్టి సైకో వీరంగం... 20 మందికి గాయాలు, కాళ్లపై కాల్చి పట్టేసిన పోలీసులు
కరీంనగర్ లో పిచ్చి తలకెక్కిన ఓ సైకో వీరంగమాడాడు. కత్తి చేతబట్టి రంగప్రవేశం చేసిన అతడు కరీంనగర్ కమాన్ వద్ద పాదచారులపై ఇష్టారాజ్యంగా దాడికి దిగాడు. ఈ దాడిలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. బాధితుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపైనా అతడు తిరగబడ్డాడు. కత్తితో పోలీసులపైనా దాడికి యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు తమ తుపాకులకు పనిచెప్పాల్సి వచ్చింది. సైకో కాళ్లపై కాల్చిన పోలీసులు అతడిని కదలకుండా చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ లో కలకలం రేపింది.