: డి.కె. ఆదికేశవులు నాయుడు కన్నుమూత


టి టి డి మాజీ ఛైర్మన్ డి. కె . ఆదికేశవులు నాయుడు(71)బెంగుళూరు లోని వైదేహి ఆసుపత్రిలో హృదోగ వ్యాధితో చికిత్స పొందుతూ కన్నుమూశారు . ఆయనకు భార్య ,కొడుకు ,ఇద్దరు కుమార్తెలు వున్నారు . ఆదికేశవులు నాయుడు చిత్తూరు లోక్ సభ సభ్యుడు గా ,తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండుసార్లు ఛైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించారు . ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ,తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ,పీ సీ సీ అధ్యక్షుడు బొత్స ,కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు సంతాపం ప్రకటించారు .

  • Loading...

More Telugu News