: ఐఐటీలలో ‘గ్రేడ్’ సాధించని విద్యార్థులు వెనక్కి!


మన దేశానికి చెందిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐటీ)లో మంచి గ్రేడ్ లు సాధించని విద్యార్థులను ఇంటికి పంపివేసింది. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు. విద్యార్థులు సరిగా చదవకపోవడం వల్ల వివిధ ఐఐటీల నుంచి ఎవరినైనా పంపేశారా? అన్న లిఖిత పూర్వక ప్రశ్నకు ఆమె సభలో సమాధానం ఇచ్చారు. 2014-15 విద్యా సంవత్సరానికి గాను 6 ఐఐటీల పరిధిలో 63 మంది విద్యార్థులు తగినన్ని గ్రేడ్ పాయింట్లు సాధించలేకపోయారని ఆమె పేర్కొన్నారు. అందులో... జనరల్-6, ఓబీసీ-9, ఎస్పీ-16, ఎస్టీ-30 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు పీర్ గ్రూప్ అసిస్టెడ్ లెర్నింగ్ (పాల్) అనే విధానాన్ని అమలు చేయాలని ఐఐటీ కౌన్సిల్ చర్చించినట్లు మంత్రి వివరించారు. కాగా, ఈ ఏడాది జూలైలో ఐఐటీ రూర్కీ ఏకంగా 73 మంది ఫస్టియర్ విద్యార్థులను తగినన్ని మార్కులు రాలేదని పంపేసింది. ఇందులో 64 మంది విద్యార్థులు ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఐఐటీ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాళ్లను ఒక ఏడాది ప్రొబేషన్‌లో ఉంచే షరతుపై మళ్లీ చేర్చుకున్నారు. మళ్లీ మొదటి సంవత్సరం చదవాలని, ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 75 శాతం రావాలనే షరతు విధించారు.

  • Loading...

More Telugu News