: ఏపీ శాసనసభలో రెండు కీలక బిల్లుల ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసిన నేపథ్యంలో నేడు శాసనసభలో అధికార పార్టీ టీడీపీ, దాని మిత్రపక్షం బీజేపీ శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు, వడ్డీ వ్యాపారాల నియంత్రణ బిల్లును ఆమోదించింది. కాల్ మనీ జడలు విప్పడంతో వడ్డీ వ్యాపారాల నియంత్రణ బిల్లును శాసనసభ ఆమోదించింది. దీనిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గ సహచరులకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.