: ఒత్తిడిని జయించడానికి చైనా యువత పిల్లో ఫైట్ !
చైనాలోని యువత దిండ్లతో ఒకరిని ఒకరు సరదాగా కొట్టుకుంటూ తమ పని ఒత్తిడిని తగ్గించుకున్నారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండగకు ముందు ఈ తరహా ఆటలు చైనాలో నిర్వహిస్తుండటం పరిపాటి. జియాంగ్స్ ప్రావిన్స్ లోని ఒక పాత కర్మాగారం వద్ద నిర్వహించిన పిల్లో ఫైట్ లో యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇటువంటి ఆటలు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారని, చాలా సరదాగా ఉంటుందని వారి పేర్కొన్నారు.