: ప్రశ్నార్థకంగా మారిన 200 మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు!
అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ అడ్మిషన్లపై నీలి నీడలు కమ్ముకోవడంతో సుమారు 200 మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు విద్యార్థులకు టికెట్లు జారీ చేసేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం నిరాకరించింది. దీంతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తమకు యూఎస్ వీసాలున్నప్పటికీ సదరు సంస్థ టికెట్లు నిరాకరించడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా కార్యాలయం ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కాగా, దీనిపై ఎయిర్ ఇండియా అధికారులు వివరణ ఇస్తూ, యూఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే, తాము టికెట్లు నిలిపివేశామని అన్నారు. ఈ విషయమై అమెరికాలోని సిలికాన్ వ్యాలి, నార్త్ వెస్టర్న్ వర్శిటీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి తమకు అన్ని రకాల అనుమతులున్నాయన్నారు.