: టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా హమిల్టన్ లో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 292 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆలౌట్ అయిన కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో విలియమ్సన్ (108) సెంచరీ చేయడంతో విజయానికి అవసరమైన 189 పరుగులు చేసింది. దీంతో టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ 2-0తేడాతో గెలుచుకుంది. సిరీస్ లో అద్భుతంగా రాణించిన విలియమ్సన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.