: మా కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు: బుద్ధా వెంకన్న
విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో తనపైన, తన సోదరుడు బుద్ధా నాగేశ్వరరావుపైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. తమ కుటుంబంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా సాక్షి పత్రికలో తమపై లేనిపోని రాతలు రాస్తున్నారని అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద చెప్పారు. సంబంధం లేని కథనాలు రాస్తున్నారని విమర్శించారు. చేతిలో పత్రిక ఉందని జగన్ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారని, ప్రధానంగా జగన్ తననే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలని బుద్ధా డిమాండ్ చేశారు. ఇకపై ఇటువంటి వార్తలు ప్రచురిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.