: చట్టాన్ని మార్చేందుకు ఇంకెంతమంది బలవ్వాలి?: ‘నిర్భయ’ తల్లి ఆవేదన
అత్యాచార కేసుల్లో దోషులను శిక్షించేందుకుగాను చట్టాల్లో మార్పులు రావాలంటే ఇంకెంత మంది అమా యకురాళ్లు బలవ్వాలంటూ ‘నిర్భయ’ తల్లిదండ్రులు ప్రశ్నించారు. ప్రజల గురించి కోర్టులు పట్టించుకోవడం లేదని, తాము చేస్తున్న పోరాటం కేవలం ‘నిర్భయ’ గురించి మాత్రమే కాదని.. ప్రతి అమ్మాయి కోసం, వారి భద్రత కోసమని అన్నారు. మన దేశంలో ఇటువంటి చట్టాల కారణంగా అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోందన్నారు. చట్టంలో మార్పులు తెచ్చేవరకు తమ పోరాటం ఆగదని జ్యోతి సింగ్ తల్లి ఆశాదేవి అన్నారు. ‘ఈ కేసులో బాల నేరస్తుడికి మళ్లీ శిక్ష విధించడం తమ పరిధిలో లేదని కోర్టు చెబుతోంది. అలాంటప్పుడు, ఈ కేసులోని ఇతర దోషులకు ఉరిశిక్ష విధించకుండా ఎందుకు కాల యాపన చేస్తున్నారు?’ అంటూ ఆమె ప్రశ్నించారు.