: ఇద్దరు చంద్రులు ఏకమయ్యారు... సీబీఐ విచారణ జరిపించాలి: మధు యాష్కీ


ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు ఏకమయ్యారని టీకాంగ్రెస్ నేత మధు యాష్కీ ఆరోపించారు. ఇద్దరూ ఏకమై ప్రజా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలతో కలసి క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్ చేస్తున్న చండీయాగానికి నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలే యాగానికి నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News