: ఇంతదూరం ఎందుకు వచ్చారని ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన ప్రిన్స్ మహేశ్
అభిమానులంటే అమితమైన ప్రేమ చూపే ప్రిన్స్ మహేశ్ బాబు, ఈ దఫా మాత్రం కాస్తంత అసహనాన్ని ప్రదర్శించాడు. తన సమయాన్ని వృథా చేయడమే కాకుండా, ఇంత దూరం ఎందుకు వచ్చారని మందలించాడు. ఇంతకీ విషయం ఏంటంటే, మహేశ్, కాజల్, సమంత నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' షూటింగ్ ఊటీలో జరుగుతుండగా, విషయం తెలుసుకున్న అభిమానులు షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగాలని కాసేపు హడావుడి చేశారు. విషయం తెలుసుకున్న మహేశ్ వారి కోరికను తీర్చేందుకు అంగీకరించి, షూటింగ్ కు కాసేపు బ్రేక్ చెప్పి వచ్చిన వేళ, అభిమానుల వద్ద కెమెరా లేకపోయిందట. దీంతో సినిమా యూనిట్ లోని ఫోటోగ్రాఫర్ ను పిలిపించి, వారి కోరిక తీర్చిన ప్రిన్స్, అంతకుముందు వారి హడావుడిని గుర్తు చేస్తూ, అసలు ఇంతదూరం రావాల్సిన అవసరం ఏంటని క్లాస్ పీకాడట!