: పుట్టినరోజు జరుపుకోడానికే జగన్ సభ నుంచి వాకౌట్ చేశారు: కాల్వ శ్రీనివాసులు


పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ కారణంగా ఈరోజు ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు చేశారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకోడానికే అసెంబ్లీ నుంచి జగన్ వాకౌట్ చేశారని ఆరోపించారు. సస్పెండ్ చేసినప్పుడు రోజా సంతోషంగానే వెళ్లిపోయారని కాల్వ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. అసలు బాక్సైట్ పై చర్చ జరగడం ప్రతిపక్ష నేతకు ఇష్టం లేదని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకే ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News