: అందుబాటులోకి 'జిల్ మోర్'... ఆవిష్కరించిన ఎస్పీ బాలు


వివిధ రంగాల్లోని కళాకారులకు ఉపాధి అవకాశాలను మరింతగా దగ్గర చేసేలా తయారైన స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ 'జిల్ మోర్'ను ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఏవైనా ఫంక్షన్లు, కార్యక్రమాలకు కళాకారులను సులభంగా ఆహ్వానించవచ్చని, యాప్ ద్వారా వారిని సంప్రదించవచ్చని తెలిపారు. వివిధ కార్యక్రమాలకు అందుబాటులో, సమీపంలో ఉండే వ్యాఖ్యాతలను సులువుగా గుర్తించవచ్చని తెలిపారు. గాయనీ గాయకులు, వ్యాఖ్యాతలు, కళాకారులకు ఈ యాప్ ఉపాధిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, 'జిల్ మోర్' ప్రచారక్తగా ఎస్పీ బాలు వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News