: రుణమాఫీతో ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? మూలకారణాలపై చర్చించాలి: హైకోర్టు
రైతుల ఆత్మహత్యలకు మూలకారణాలపై చర్చించాలని తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల సమస్యలపై నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేవలం రుణమాఫీతో ఆత్మహత్యల నివారణ సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలతో రావాలని ఇరు రాష్ట్రాలకు సూచించింది. కాగా, హైకోర్టు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేయాలని కోదండరాం తరపు న్యాయవాది కోరారు.