: బీహార్ మాజీ సీఎం మాంఝీ కుమార్తె సునయనపై కేసు


బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమార్తె సునయనా దేవిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. సునయన కోడలు సోనీ మృతి చెందగా, సోనీ తండ్రి రామ్ దేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సునయన తన కుటుంబ సభ్యులతో కలసి సోనీని హత్య చేశారని రామ్ దేవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియలు సైతం తమకు చెప్పకుండా ముగించారని ఆరోపించారు. 2008లో సునయన కుమారుడు విక్కీతో సోనీ వివాహం జరుగగా, అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన కుమార్తెను వేధించేవారని పోలీసులకు తెలిపారు. ఈ కేసుపై స్పందించేందుకు మాంఝీ మాత్రం నిరాకరించారు.

  • Loading...

More Telugu News