: చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి సోకింది: కేవీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి వచ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కూడా తనకు చంద్రబాబు సన్నిహితుల ద్వారానే తెలిసిందని చెప్పుకొచ్చారు. అల్జీమర్స్ వల్ల ఎలాంటి ప్రాణహాని లేనప్పటికీ, జ్ఞాపకశక్తి లోపిస్తుందని తెలిపారు. అయితే, ఆ వ్యాధి చంద్రబాబుకు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పారు.