: తెలంగాణలో పోలీసు నియామకాలకు అర్హత వయస్సు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలకు అర్హత వయస్సును మూడు సంవత్సరాలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు నియామక బోర్డు ద్వారా నేరుగా జరిగే నియామకాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. మరోవైపు బందోబస్తు సమయంలో విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది భోజన ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిల్లో భోజన ఛార్జీలు రూ.100 నుంచి రూ.200కు పెంచారు. మిగతా జిల్లాల్లో భోజన ఛార్జీలు రూ.100 నుంచి రూ.150కు పెంచారు.